స్పైస్ జెట్ ను వెంటాడుతున్న ఆటో పైలట్ సమస్య

స్పైస్ జెట్ ను వెంటాడుతున్న ఆటో పైలట్ సమస్య

స్పైస్ జెట్ కంపెనీకి చెందిన ‘బోయింగ్ 737’ విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఇవాళ ఉదయం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మహారాష్ట్రలోని నాసిక్‌కు బయలుదేరిన విమానంలో ఆటోపైలట్ సమస్య తలెత్తింది. దీంతో బయలుదేరిన కాసేపటికే మళ్లీ ఢిల్లీ ఎయిర్ పోర్టుకు వెనక్కి వచ్చేసింది. బోయింగ్ 737 విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అధికారులు వెల్లడించారు.

ఇంతకుముందు నెలరోజుల వ్యవధిలోనే స్పైస్ జెట్ కు చెందిన నాలుగుకుపైగా విమానాల్లో సాంకేతిక సమస్యలు చోటుచేసుకున్నాయి. దీంతో అప్పట్లో స్పైస్ జెట్ యాజమాన్యానికి డీజీసీఏ షో-కాజ్ నోటీసులు జారీ చేసింది. ఎనిమిది వారాల పాటు గరిష్టంగా 50 శాతం విమానాలను మాత్రమే నడపాలంటూ స్పైస్ జెట్ కు జూలై 27న ఆదేశాలు జారీ చేసింది.