
అప్పుల ఉబిలో కురుకుపోయిన జెట్ ఎయిర్‌వేస్, మరోవైపు ఇథియోపియా విమాన ప్రమాదంతో బోయింగ్ 737 మాక్స్ విమానాల నిలిచిపోయాయి. దీంతో దేశంలో విమానాలు అందుబాటులోకి లేకపోవడంతో ఎయిర్ లైన్లు చివరి నిమిషంలో సర్వీసులను రద్దు చేయాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల కారణంగా ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ త్వరలోనే 16 బోయింగ్ విమానాలను అందుబాటులోకి తీసుకురానుంది. 16 బోయింగ్ 737800NG విమానాలను డ్రై లీజు కింద సంస్థలోకి తీసుకుంటున్నట్లు స్పైస్ జెట్ తెలిపింది. ఈ విమానాలను దిగుమతి చేసుకునేందుకు అవసరమైన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(NOC) కోసం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు సంస్థ తెలిపింది. మరో 10రోజుల్లో ఈ విమానాలు సంస్థలోకి చేరుతాయని చెప్పింది. దీంతో సంస్థ షేర్లు భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. స్టాక్ ఎక్స్ఛేంజీల్లో స్పైస్‌జెట్ షేరు విలువ దాదాపు 10శాతం లాభంతో ట్రేడ్ అవుతోంది.