దలైలామాకు గాంధీ మండేలా అవార్డు

దలైలామాకు గాంధీ మండేలా అవార్డు

ధర్మశాల: టిబెటన్​ ఆధ్యాత్మిక గురు దలైలామాకు గాంధీ మండేలా అవార్డును హిమాచల్​ ప్రదేశ్ ​గవర్నర్​ రాజేంద్ర అర్లేకర్ అందజేశారు. శనివారం మెక్లిడ్​ గంజ్​లో గాంధీ మండేలా ఫౌండేషన్​ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ అవార్డు ప్రదానం చేశా రు. ఈ సందర్భంగా గవర్నర్​మాట్లాడుతూ.. దలైలామా ఈ అవార్డుకు ప్రపంచంలోనే అర్హత కలిగిన వ్యక్తి అని, ఆయన శాంతికి యూనివర్సల్ ​అంబాసిడర్​ అని కొనియా డారు.

అతని అహింస, కరుణా సూత్రాలు ప్రస్తుత ప్రపంచానికి అవసరమని, ఇవి యుద్ధం కంటె ప్రభావవంతమని పేర్కొన్నా రు. దలైలామాకు.. గాంధీ, మండేలా తర్వాత ప్రపంచ పౌరుడిగా మారగల సామర్థ్యం ఉందన్నారు. దలైలామా మాట్లా డుతూ.. ప్రపంచ శాంతికి అహింస, కరుణ ఎంతో అవసరమని, ఈ సూత్రాలు వేల ఏళ్లు గా భారతీయ సంస్కృతిలో నిక్షిప్తమై ఉన్నా యన్నారు. యుద్ధంద్వారా ఏ సమస్యనూ పరిష్కరించలేమని పేర్కొన్నారు.