అప్సరసలు అంటే ఎవరు.. వారి పేర్లు ఏమిటి.. ఎక్కడ ఉంటారో తెలుసా..

అప్సరసలు అంటే ఎవరు.. వారి పేర్లు ఏమిటి..  ఎక్కడ ఉంటారో తెలుసా..

 అందం, సౌందర్యం గురించి చెప్పేటప్పుడు అప్సరలా ఉంది అంటారు. దాదాపు ఈ మాట అందరూ వినేఉంటారు. కానీ వాళ్లెవరంటే మాత్రం క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడతారు.ఒక అమ్మాయి అందంగా వుంటే అప్సరసలా ఉంది అంటారు.రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ అనే నలుగురు మాత్రమే అప్సరసలు అనుకునేవారూ వున్నారు. నిజానికి అప్సరసలు ఎంతమంది అనే విషయం మీకు తెలుసా? అప్సరసలు మొత్తం ముప్పై ఒక్క మంది.. ఇక ఆలస్యం ఎందుకు వాళ్ళ పేర్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. . .

అందం గురించి వర్ణించేటప్పుడు హయ్యెస్ట్ పొగడ్త ఏంటంటే అప్సరస. దేవలోకంలో ఆటపాటలతో అలరించే అప్సరసలు అప్పుడప్పుడు తాపసులను వెంట తిప్పుకున్న సందర్భాల గురించీ పురాణాల్లో ప్రస్తావన ఉంది. ఓ  సందర్భంలో విశ్వామిత్రుడి తపస్సు భంగం చేయడానికి వెళ్లి సక్సెస్ అయిన మేనక కొన్నాళ్ల తర్వాత శంకుతలకు జన్మనిచ్చింది. ఆ తర్వాత కణ్వమహర్షి దగ్గర పెరిగిన శకుంతలను...వేటకు వచ్చిన దుష్యంతుడు చూసి వివాహం చేసుకుంటాడు. ఇలా చాలామంది అప్సరసలు తాపసుల దీక్షకు భంగం కలిగించారు. ఇలా వెళ్లివారిలో మహర్షుల మనసు మళ్లించడంలో కొంతమంది అప్సరసలు విజయాన్ని సాధిస్తే, మరికొంతమంది మహర్షుల ఆగ్రహావేశాలకి గురై శాపాలపాలయ్యారు. సాధారణంగా అప్సరసలు అంటే రంభ, ఊర్వశి,మేనక అని మాత్రమే తెలుసు కానీబ్రహ్మ పురాణం ప్రకారం అప్సరసల సంఖ్య 31. వీరిని ఏకత్రింశతి అప్సరసలు అని కూడా అంటారు. 

31 మంది అప్సరసలు వీరే

1) రంభ 2) ఊర్వశి 3) మేనక 4) తిలోత్తమ 5) ఘృతాచి 6) సహజన్య 7) నింలోచ 8) వామన 9) మండోదరి 10) సుభోగ 11) విశ్వాచి 12) విపులానన 13) భద్రాంగి 14) చిత్రసేన 15)   ప్రమోచన 16) ప్రమ్లోద 17) మనోహరి 18) మనో మోహిని 19) రామ 20) చిత్రమధ్య 20) శుభానన 21) సుకేశి 22) నీలకుంతల 23) మన్మదోద్ధపిని 24) అలంబుష 25) మిశ్రకేశి 26) పుంజికస్థల 27) క్రతుస్థల 28) వలాంగి 29) పరావతి 30) మహారూప 31) శశిరేఖ.. వీరంతా అప్సరసలు అని చెప్పాలి.ఇది అప్సరసల గురించి చాలామందికి తెలియని నిజం..

స్వర్గం-నరకం ఉంటాయని చెబుతుంటారంతా. ఎవరైనా చూశారా అని మాత్రం అడగకండి. ఎందుకంటే పురాణాల్లో చదవడం, ఎవరైనా చెప్పినప్పుడు వినడం తప్ప వీటిగురించి పెద్దగా తెలియదు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే అప్సరసలు స్వర్గంలో ఉంటారు. స్వర్గంలో దేవతలను తమ నాట్యగానాలతో అలరించేవారే అప్సరసలు. వీళ్లు సప్తగణాల్లో ఓ వర్గం. సప్తగణాలంటే... 1. ఋషులు 2. గంధర్వులు 3. నాగులు 4. అప్సరసలు 5. యక్షులు 6. రాక్షసులు 7. దేవతలు. వీరిలో అందరి నోట్లో నిత్యం నానే పదం అప్సరసలు. ఈ పదం గురించి తెలిసినా వాళ్లెవరన్నది మాత్రం చాలామందికి తెలియదు.

అందం అంటే ఆడవాళ్ళు..ఆడవాళ్ళు అంటే అందం అన్న సంగతి అందరికి తెలిసిందే.. పూర్వ కాలం నుంచి ఇప్పటివరకు స్త్రీ స్థానం ప్రత్యేకంగా ఉంది. యుగ యుగాల నుండీ సౌందర్యానికి ప్రతీకగా స్త్రీని వర్ణిస్తూ వచ్చారు కవులూ, రచయితలూ. స్త్రీ నయనాలను చేపలతో, పళ్లను దానిమ్మ గింజల తో, పెదవుల ను విల్లుతో పోల్చడం సర్వ సాధారణం. అయితే, ప్రకృతి, స్త్రీ అందానికి నిదర్శనాలు..అయితే, స్త్రీ అందాన్ని ఆరాధించే విధానాలలో కాలక్రమేణా ఎన్ని మార్పులొచ్చినప్పటికీ ఆరాధన అనేది మాత్రం పెరుగుతూనే వచ్చింది తప్ప తగ్గలేదు.. అప్పటికీ, ఇప్పటికీ కూడా ఒకే ఆదరణ ఉంది.. కేవలం హీరోయిన్ అందచందాల తో కనువిందు చేసుకునేందుకే సినిమాలకు వెళ్లేవాళ్లు సైతం వుంటారు. ఇక సినీ రంగంలో ప్రత్యేకించి హీరోయిన్లను ఎంతగానో అభిమానించే ప్రేక్షకులూ వున్నారు.వెండి తెరపైనే కాదు, బుల్లితెర పై కూడా ఎంతో మందిని ఆరాధించేవాళ్ళు ఉన్నారు.

ALSO  READ : ఏంటీ.. యూట్యూబ్ లో సాంగ్ సెర్చ్ చేయాలంటే హమ్ చేస్తే సరిపోతుందా