వికలాంగుల కోసం దేశంలోనే మొదటి ప్రభుత్వ పాఠశాల

వికలాంగుల కోసం దేశంలోనే మొదటి ప్రభుత్వ పాఠశాల

దేశంలో ఇప్పటివరకూ ఎన్నో ప్రభుత్వ పాఠశాలలున్నా... వికలాంగుల కోసం మాత్రం ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా లేదు. అయితే తాజాగా అలాంటి వారి కోసం ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించడంలో ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు. పుదుచ్చేరి లాస్‌పేటలో మొదటి సారిగా ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలో వికలాంగులకు విద్యనందిస్తున్నారు. ఇక్కడ మానసిక వికలాంగులు, ప్రసంగం-లోపం, వినికిడి లోపం ఉన్న పిల్లలకు సమగ్ర విద్యను అందిస్తున్నామని ప్రధానోపాధ్యాయుడు భాస్కరన్ తెలిపారు. కొత్త విద్యా విధానాన్ని అమలు చేయాలన్న ఉద్దేశంతో.. అందులో భాగంగా సమ్మిళిత విద్యకు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటివరకూ ఈ పాఠశాలలో15 మంది విద్యార్థులు పేరు నమోదు చేసుకున్నారని చెప్పారు. ఈ విద్యార్థుల కోసం ప్రత్యేక ఉపాధ్యాయులున్నారన్నారు. తమ వద్ద స్పీచ్ థెరపీ, సెన్సరీ ఫిజియోథెరపీ & ఇన్‌క్లూసివ్ ఫుట్‌వర్క్ కూడా అందుబాటులో ఉందని స్పష్టం చేశారు.