
- సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు తెలిపిన స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి
హైదరాబాద్, వెలుగు: గచ్చిబౌలి కాంప్లెక్స్‌లోని స్పోర్ట్స్ విలేజ్ టవర్స్‌ను తిరిగి స్పోర్ట్స్ అథారిటీకి అప్పగించడంపై స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ( శాట్) చైర్మన్ శివసేనారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అన్ని రంగాల మాదిరిగానే సీఎం రేవంత్ రెడ్డి క్రీడల అభివృద్ధికి విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు.
క్రీడాకారుల కోసం స్పోర్ట్స్ అథారిటీ చేసిన విజ్ఞప్తి మేరకు స్పోర్ట్స్ టవర్‌ను క్రీడాభివృద్ధి కోసం కేటాయించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. క్రీడారంగ అభివృద్ధిని విస్మరించిన గత ప్రభుత్వం క్రీడాకారులు, క్రీడాభిమానులు ఎంత నిరసన వ్యక్తం చేసినా పట్టించుకోకుండా స్పోర్ట్స్ విలేజ్ ను సంబంధం లేని శాఖకు అప్పగించడం బాధాకరమని అన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నూతన క్రీడా విధానాన్ని అవలంబించడంతోపాటు స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం హర్షనీయమని చెప్పారు.