చెస్ విజేత సంహితకు సహకారం అందిస్తాం: SATS చైర్మన్

చెస్ విజేత సంహితకు సహకారం అందిస్తాం: SATS చైర్మన్

హైదరాబాద్, వెలుగు: చదరంగంలో రాణిస్తున్న హైదరాబాద్ యువ క్రీడాకారిణి సంహితకు తగిన సహకారం అందిస్తామని స్పోర్ట్స్‌‌ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్జ్) చైర్మన్‌‌ శివసేనా రెడ్డి తెలిపారు. 

ఇటీవల శ్రీలంకలో జరిగిన కామన్వెల్త్ యూత్ చెస్ టోర్నమెంట్ మూడు పతకాలు నెగ్గిన హైదరాబాద్ యంగ్ ప్లేయర్‌‌‌‌ సంహితను  శాట్జ్ చైర్మన్‌‌ శివసేనా రెడ్డి, వీసీ ఎండీ సోనిబాలాదేవి బుధవారం ఎల్బీ స్టేడియంలో  సన్మానించారు. 

ఈ టోర్నీలో సంహిత  బ్లిట్జ్‌‌లో స్వర్ణం, ర్యాపిడ్‌‌లో కాంస్యం, క్లాసికల్ ఫార్మాట్‌‌లో మరో కాంస్యం గెలిచింది.  విమెన్ గ్రాండ్ మాస్టర్ కావాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్న సంహిత ప్రభుత్వం తరఫున  సహకారం అందజేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.