ఫ్రీడమ్ కప్ టోర్నమెంట్ విజేతలకు బహమతుల ప్రదానం

ఫ్రీడమ్ కప్ టోర్నమెంట్ విజేతలకు బహమతుల ప్రదానం
  • మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
  • ఫ్రీడమ్ కప్ టోర్నమెంట్ విజేతలకు బహమతుల ప్రదానం

హైదరాబాద్/ఎల్​ బీనగర్/ వికారాబాద్, వెలుగు:  బల్దియా ఆధ్వర్యంలోని క్రీడా మైదానాల్లో రూ.86 కోట్లతో మౌలిక వసతులు కల్పించనున్నట్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా జీహెచ్ఎంసీ నిర్వహించిన ఫ్రీడమ్ కప్ స్పోర్ట్స్ టోర్నమెంట్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ గురువారం విక్టరీ ప్లే గ్రౌండ్ లో నిర్వహించారు. చీఫ్ గెస్టుగా హాజరైన మేయర్ విజయలక్ష్మి విజేతలకు ప్రైజ్ లు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 11 క్రీడా మైదానాల్లో 13 విభాగాల్లో ఆటల పోటీలను నిర్వహించగా 386 టీమ్స్ పాల్గొన్నాయన్నారు.

సమావేశంలో గన్ ఫౌండ్రీ  కార్పొరేటర్ విశ్వసురేఖ, అడిషనల్ కమిషనర్  విజయలక్ష్మి, జోనల్ కమిషనర్ రవికిరణ్, స్పోర్ట్స్ డైరెక్టర్ డీఎస్ బాషా తదితరులు పాల్గొన్నారు.  రాచకొండ పోలీసులు, రంగారెడ్డి జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రీడమ్ కప్ టోర్నమెంట్ విజేతలకు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో  మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రైజ్ లు అందజేశారు. 112 మంది క్రీడాకారులకు సర్టిఫికెట్లు, మెమెంటోలు ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఎగ్గె మల్లేశం, దయానంద్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, సీపీ మహేశ్​భగవత్ పాల్గొన్నారు. వికారాబాద్ పట్టణంలోని బ్లాక్ గ్రౌండ్స్ లో ఆటల పోటీలను ఎమ్మెల్యే ఆనంద్ ప్రారంభించగా.. విజేతలకు కలెక్టర్ నిఖిల ప్రైజ్ లు అందజేశారు.