V6 News

పెదిరి పహాడ్ లో స్పోర్ట్స్ మీట్ ప్రారంభం

పెదిరి పహాడ్ లో స్పోర్ట్స్ మీట్ ప్రారంభం

మద్దూరు, వెలుగు : పీఎంశ్రీ ప్రాజెక్టు ఇన్నోవేషన్ లో భాగంగా మంగళవారం మండలంలోని పెదిరిపహాడ్ జడ్పీ హైస్కూల్ ఆవరణలో స్పోర్ట్స్ మీట్ ను ఎంఈవో బాలకిష్టప్ప ఆధ్వర్యంలో సెక్టోరియల్ ఆఫీసర్ రాజేంద్ర కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అండర్ –17 స్టూడెంట్లకు ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, ఫుట్ బాల్, రన్నింగ్, లాంగ్ జంప్, షాట్ పుట్ పోటీలు నిర్వహించారు. 

అనంతరం సెక్టోరియల్ ఆఫీసర్ మాట్లాడుతూ క్రీడలు మానసిక, శారీరక శ్రమను పెంచుతాయన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో కమ్యూనిటీ మొబిలైజింగ్ ఆఫీసర్ విద్యాసాగర్, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ శ్రీనివాస్, జిల్లా మిడ్ డే మీల్స్ ఇన్​చార్జి యాదయ్య శెట్టి, టీచర్లు పాల్గొన్నారు.