రచన జర్నలిజం కాలేజీలో స్పాట్ అడ్మిషన్లు

 రచన జర్నలిజం కాలేజీలో స్పాట్ అడ్మిషన్లు

హైదరాబాద్​, వెలుగు: ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న రచన జర్నలిజం కాలేజీ ఎం.ఎ జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ కోర్సులో స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ప్రవేశాలకు చివరి తేదీని నవంబర్ 18గా నిర్ణయించింది. 

ఈ మేరకు గురువారం కాలేజీ ప్రిన్సిపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. మరిన్ని వివరాలకు హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ మెమోరియల్ ఎడ్యుకేషన్ క్యాంపస్ లోని రచన జర్నలిజం కాలేజీలో సంప్రదించాలని సూచించారు. అవసరమైతే 99596 40797 నెంబర్​లో సంప్రదించాలని కోరారు.