ఏఐ అందుబాటులోకి వచ్చాక డిజిటల్ కంటెంట్ విషయంలో రోజురోజుకూ ఆందోళనలు పెరుగుతూనే ఉన్నాయి. ఏది అసలైనదో, ఏది ఏఐ జనరేటెడ్ ఫొటోనో తెలుసుకోలేకపోతున్నాం. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు గూగుల్ జెమిని యాప్‌లోనే ఒక కొత్త ఏఐ టూల్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
గూగుల్ ద్వారా క్రియేట్, ఎడిట్ చేసిన ఫొటోలను ఇది ఈజీగా కనిపెట్టేస్తుంది. జెమిని యాప్‌లో ఫొటోని అప్‌లోడ్ చేసి ‘‘ఇది ఏఐ -జనరేటెడ్ ఫొటోనా?” అని అడిగితే చాలు.. క్షణాల్లో చెప్పేస్తుంది. కాకపోతే.. ఈ ఫీచర్ ప్రస్తుతం ఫొటోలకు మాత్రమే పనిచేస్తుంది. ఏఐ జనరేటెడ్ వీడియో, ఆడియో కంటెంట్‌ని కనిపెట్టే ఫీచర్‌ని మరికొన్ని రోజుల్లో యాడ్ చేస్తామని గూగుల్ చెప్పింది.
