డిస్ ఇన్ ఫెక్ట్ తో ఆరోగ్యానికి హానీ తప్ప ప్రయోజనం లేదు

డిస్ ఇన్ ఫెక్ట్ తో ఆరోగ్యానికి హానీ తప్ప ప్రయోజనం లేదు
  • స్పష్టం చేసిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్

జెనీవా : కరోనా వైరస్ ను వ్యాప్తిని నివారించేందుకు అన్ని దేశాలు డిస్ ఇన్ ఫెక్షన్ చేస్తున్నాయి. కరోనా పేషెంట్ తిరిగిన ప్రాంతాన్ని, ఏరియాను డిస్ ఇన్ ఫెక్ట్ చేసేసి ఇక కరోనా వైరస్ ఆ ప్రాంతంలో చనిపోయిందని భావిస్తున్నాయి. కానీ అసలు దీని ద్వారా ఏ మాత్రం ప్రయోజనం లేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) తాజాగా తేల్చిచెప్పింది. పైగా జనం ఆరోగ్యానికి మరింత హానీ జరుగుతుందని ప్రకటించింది. “రోడ్లు, మార్కెట్లు, బహిరంగ ప్రదేశాల్లో డిస్ ఇన్ ఫెక్ట్ స్ర్పే చేయటం ద్వారా కరోనా వైరస్ చనిపోతుందని ఎప్పుడు చెప్పలేదు. పైగా దూళి, శిథిలాల పై రసాయనాలను చల్లినప్పుడు అవి ఇన్ యాక్టివ్ గా మారిపోతాయి” అని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. రోడ్లు, విధులను వైరస్ సంక్రమణ ప్రాంతాలుగా గుర్తించలేదని అలాంటి ప్రాంతాల్లో స్ప్రే చేయటం జనాల ఆరోగ్యానికి హాని చేస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. క్రిమిసంహారక మందులు కలిసిన రసాయనాలను మనుషులపై చల్ల టాన్ని ఎట్టి పరిస్థితుల్లో సిఫారసు చేయమని డబ్యూహెచ్ఓ తెలిపింది. ఇలాంటి వాటి కారణంగా వైరస్ వ్యాప్తిని ఏమాత్రం అడ్డుకోలేమని స్పష్టం చేసింది. క్లోరిన్ తో పాటు ఇతర రసాయనాల కారణంగా స్కిన్ తో పాటు ఇతర సమస్యలు తప్పవని హెచ్చరించింది. కరోనా వైరస్ అనేక రకాల ఉపరితలలపై చాలా రోజులు ఉండగలవని స్టడీస్ చెబుతున్నాయని డబ్యూహెచ్ఓ గుర్తు చేసింది. డిన్ ఇన్ ఫెక్ట్ ను మనుషులపై చల్లటం మానుకోవాలని సూచించింది.