స్పుత్నిక్- వి వ్యాక్సిన్ కు కేంద్రం అనుమతి

స్పుత్నిక్- వి వ్యాక్సిన్ కు కేంద్రం అనుమతి

దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడం... వ్యాక్సిన్ స్టాక్ తగ్గుతున్న వేళ... మరో వ్యాక్సిన్ కు DCGI ఎక్స్ పర్ట్స్ కమిటీ పర్మిషన్ ఇచ్చింది. రష్యా మేడ్ స్పుత్నిక్ V వ్యాక్సిన్ అత్యవసర వాడకానికి అనుమతిచ్చింది. దేశంలో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉంది. అనేక సెంటర్లను క్లోజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే... మరో 5 వ్యాక్సిన్ల వాడకానికి అనుమతులివ్వాలని కేంద్రం నిర్ణయించుకున్నట్టు సమాచారం. అందులో భాగంగానే స్పుత్నిక్ Vపై చర్చించేందుకు ఇవాళ ఎక్స్ పర్ట్స్ కమిటీ సమావేశమైంది. 

రష్యాకు చెందిన RDIF తయారు చేసిన స్పుత్నిక్ V వ్యాక్సిన్ ను మనదేశంలో రెడ్డీస్ ల్యాబ్ ఉత్పత్తి చేస్తోంది. ఈ మధ్యే సెకండ్, థర్డ్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ ని రెడ్డీస్ ల్యాబ్ కంప్లీట్ చేసింది. దేశంలో 18 నుంచి 99 ఏళ్ల మధ్య వయస్సున్న 1600 మందిపై స్పుత్నిక్ క్లినికల్ ట్రయల్స్ జరిగాయి. వ్యాక్సిన్ ఎఫికసీ రేట్ 91.6 శాతంగా ఉందని ప్రకటించింది. ఈ నెల ఒకటో  తేదీన స్పుత్నిక్ వ్యాక్సిన్ పై ఎక్స్ పర్ట్స్ కమిటీ డిస్కస్ చేసింది. వ్యాక్సిన్ తో పెరిగే రోగనిరోధక శక్తికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని రెడ్డీ లాబోరేటరీస్ ను ఆదేశించింది. భారత్, రష్యాలో మూడో ట్రయల్ కు సంబంధించిన డేటా కూడా ఇవ్వాలని చెప్పింది. దేశంలో స్పుత్నిక్ వ్యాక్సిన్ వాడకానికి అనుమతి ఇవ్వాలని ఫిబ్రవరి 19న అప్లికేషన్ పెట్టుకుంది. వివరాలన్నింటిని DCGIకి అందజేసింది రెడ్డీస్ ల్యాబ్. వ్యాక్సిన్ ప్రొడక్షన్... వినియోగానికి పర్మిషన్ ఇవ్వాలని కోరింది. 

రెడ్డీస్ ల్యాబ్ సమర్పించిన వివరాలపై సంతృప్తి చెందిన DCGI ఎక్స్ పర్ట్స్ కమిటీ స్పుత్నిక్ V వ్యాక్సిన్ ఎమర్జెన్సీ యూసేజీకి అప్రూవల్ ఇచ్చింది. మొత్తంగా దేశంలో వాడకానికి పర్మిషన్ వచ్చిన మూడో వ్యాక్సిన్ గా స్పుత్నిక్ V నిలిచింది. ఇంతకుముందు ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్, భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ లకు అప్రూవల్ ఇచ్చారు. ఈ వ్యాక్సిన్ లనే దేశ ప్రజలకు ఇస్తున్నారు. త్వరలోనే స్పుత్నిక్ V వ్యాక్సిన్ కూడా ప్రజలకు అందుబాటులోకి రానుంది.