
రష్యా కరోనా వ్యాక్సిన్ 92శాతం పనిచేస్తుందని రష్యన్ ఫెడరేషన్ అధికారులు వెల్లడించారు. రష్యాకు చెందిన స్పుత్నిక్ వి మూడో హ్యూమన్ ట్రయల్స్ బెలారస్, యూఏఈ, వెనుజులాతో పాటు మరికొన్ని దేశాల్లో జరుగుతున్నాయి. మన దేశంలో హ్యూమన్ ట్రయల్స్ రెండు, మూడో దశల్లో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో 10వేల మందికి పైగా నిర్వహించిన మూడో దశ అంతర్గత హ్యూమన్ ట్రయల్స్ లో స్పుత్నిక్ వీని ప్రయోగించగా..సుమారు 92శాతం పనిచేస్తున్నట్లు సైంటిస్ట్ లు తెలిపారు.
మూడో దశ ట్రయల్స్ లో భాగంగా తొలి వ్యాక్సిన్ పై 21రోజుల పాటు అంతర్గత వాలంటీర్లపై ప్రయోగించగా మంచి ఫలితాలు వచ్చాయని రష్యన్ ఫెడరేషన్ అధికారులు చెప్పారు. కాగా కొన్ని రోజుల క్రితమే అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీ .. తాము రూపొందించిన కోవిడ్ టీకా 90 శాతం సమర్థవంతంగా ఉన్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే