‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ మూవీ రివ్యూ

‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ మూవీ రివ్యూ

రివ్యూ: ఎస్ఆర్ కళ్యాణమండపం
రన్ టైమ్: 2 గంటల 20 నిమిషాలు
నటీనటులు: కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్, సాయికుమార్, తులసి, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ అయ్యర్ తదితరులు
సినిమాటోగ్రఫీ : విశ్వాస్ డానియల్
మ్యూజిక్: చైతన్ భరద్వాజ్
కథ, స్క్రీన్ ప్లే, మాటలు: కిరణ్ అబ్బవరం
నిర్మాతలు: ప్రమోద్, రాజు
దర్శకత్వం: శ్రీధర్ గాదె
రిలీజ్ డేట్: ఆగస్టు 6, 2021

కథేంటి?

తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఎస్ఆర్ కళ్యాణ మండపాన్ని సరిగ్గా నడపలేకపోతాడు ధర్మ (సాయి కుమార్). తాగుడుకు బానిసై దాన్ని పట్టించుకోడు. అతని కొడుకు కళ్యాణ్ (కిరణ్ అబ్బవరం) కాలేజ్‌‌లో చదువుతూ ఆవారాగా తిరుగుతుంటాడు. సింధు ( ప్రియాంక జవాల్కర్) అనే అమ్మాయి వెనక పడుతుంటాడు. తండ్రితో మాట్లాడడు. కానీ ఓ రోజు వాళ్ల అమ్మ అతనికి కళ్యాణ మండపం బాధ్యతల్ని అప్పజెప్తుంది. అప్పటినుంచి అందులో పెళ్లిల్లు చేయించి తాత, నాన్న పేరు నిలబెట్టాలనుకుంటాడు. చివరికి ఆ కళ్యాణ మండపాన్ని ఎలా బాగు చేశాడు, తండ్రితో మాట్లాడకపోవడానికి కారణం ఏంటనేది మిగిలిన కథ.

నటీనటుల పర్ఫార్మెన్స్:

కిరణ్ అబ్బవరంలో మంచి ఈజ్ ఉంది. కళ్యాణ్ అనే యువకుడి పాత్రలో బాగా నటించి అలరించాడు. క్లైమాక్స్‌‌లో ఓ ఎమోషనల్ సీన్‌‌లో సింగిల్ ఫ్రేమ్‌‌లో లెంగ్తీ షాట్ చేశాడు. ఆ ఒక్క సీన్ చాలు అతడు మంచి నటుడని చెప్పడానికి. ప్రియాంక జవాల్కర్ అందంగా ఉంది. సింధు పాత్రలో బాగా చేసింది. సాయికుమార్‌‌కు మంచి పాత్ర దక్కింది. ఆయన రాణించాడు. తులసి, శ్రీకాంత్ అయ్యర్, తనికెళ్ల భరణి తదితరులు వాళ్ల పరిధిమేర నటించారు.

టెక్నికల్ వర్క్:

ఈ సినిమాకు సంగీతం, సినిమాటోగ్రఫీ ప్లస్ అయ్యాయి. చైతన భరద్వాజ్ అందించిన పాటలన్నీ బాగున్నాయి. విశ్వాస్ కెమరా పనితనం ఆకట్టుకుంది. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్‌‌గా ఉండాల్సింది. ఫైట్లు, ఆర్ట్ వర్క్ బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూయ్స్ చెప్పుకోదగ్గట్టు లేవు. డైలాగులు ఫర్వాలేదు.

విశ్లేషణ:

‘‘ఎస్ఆర్ కళ్యాణమండపం’’ రెగ్యులర్ యూత్ ఫుల్ కమర్షియల్ ఎంటర్ టైనర్. హీరోయిన్  వెంట పడుతూ రెండు మూడు సీన్లు, ఫ్రెండ్స్‌‌తో ఐదారు కామెడీ పంచ్‌‌లు, రెండు పాటలు, మూడు ఫైట్లు, బలవంతంగా ఇరికించినట్టు ఉన్న ఫాదర్ సెంటిమెంట్.. ఇవి తప్పితే సినిమాలో సరైన కథ లేదు. కథనం అస్సలు లేదు. ఇష్టం వచ్చినట్టు సీన్లు తీసేశారు. యూత్‌‌ను టార్గెట్ చేసి తీసినట్టు అనిపిస్తుంది. నటీనటుల పర్ఫార్మెన్స్, మ్యూజిక్ ఈ సినిమాకు ప్రధాన బలం. కానీ పకడ్బందీ స్క్రీన్ ప్లేతో మంచి స్టోరీ డిజైన్ చేసుకుని ఉంటే ఈ సినిమా ఇంకా మంచి రేంజ్‌‌కు వెళ్లేది. అన్నీ బలవంతంగా ఇరికించినట్టు అనిపిస్తుంది. హీరోయిన్‌‌తో లవ్ ట్రాక్, ఫాదర్ సెంటిమెంట్, యాక్షన్ ఎపిసోడ్ ఇవన్నీ ఫోర్స్‌‌డ్‌‌గా ఉన్నాయి. ఫస్టాఫ్ ఫర్వాలేదనిపించినా.. సెకండాఫ్ సెంటిమెంట్ సీన్లు పేలవంగా తయరయ్యాయి. అందుకే హీరో, వాళ్ల ఫాదర్ ఎంత ఎమోషనల్‌‌గా ఫీలవుతున్నా ప్రేక్షకుడు వాళ్ల పాత్రలతో కనెక్ట్ కాడు. అందుకే సెకండాఫ్ మొత్తం బోర్ కొడుతుంది. యూత్‌‌కు నచ్చే అంశాలు అక్కడక్కడ ఉన్నాయి కాబట్టి ఈ మూవీ వాళ్లకు ఫర్వాలేదనిపిస్తుంది. కానీ మిగతా ఆడియన్స్‌ను మాత్రం నిరాశపరుస్తుంది.

బాటమ్ లైన్: బలవంతపు కళ్యాణం