
హిందువులు వ్రతాలకు.. పూజలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఇక శ్రావణమాసం వచ్చిందంటే మహిళల హడావిడి అంతా ఇంతా కాదు. పూజలు.. నోములు.. వ్రతాలు చేసే నెల శ్రావణమాసమే. ఈఏడాది (2025) విశ్వావసునామ సంవత్సరం లో జులై25 శుక్రవారం నుంచి శ్రావణమాసం ప్రారంభమవుతుంది. శ్రావణమాసం లో ఏ పండుగలు ఎప్పుడొచ్చాయో ఈ కథనంలో తెలుసుకుందాం..
దక్షిణాయంలో శ్రావణమాసానికి ఎంతో విశిష్టత ఉందని పండితులు చెబుతున్నారు. సాక్షాత్తు శ్రీమన్నారయణుడైన విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రవణం అనే పేరుతో శ్రావణమాసం ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవికి శ్రావణమాసం అంటే ఎంతో ఇష్టమంటున్నారు పండితులు.
శ్రావణ మాసం అంటే పండుగల మాసం. వర్షరుతువుతో పరిసరాలు పచ్చగా కళకళలాడే కాలం. ఇళ్లన్ని పూజాధికాలతో శోభిల్లే కాలం. అటువంటి శ్రావణ మాసంలో వచ్చే పండుగలు, నోములు, వ్రతాలతో ఇళ్లన్నీ ఆధ్యాత్మిక శోభతో నిండిపోతుంటాయి. మహిళలు పూజలు చేస్తు భక్తి నిండిన మనస్సులో ఉంటారు. మహిళలు కళకళలాడుతుంటే ఆ ఇల్లే సౌభాగ్యాలతో వర్ధిల్లుతుందంటారు. కాబట్టి శ్రావణ మాసం అంటే పూజలే కాదు ఆనందాల కాలం. లక్ష్మీదేవి ఇళ్లల్లో కొలువుండే మాసం. ఆమెకు అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణమాసం. అందుకే వ్రతాలు, నోములు నోచుకునే మహిళలు శ్రావణమాసంలో నిర్వహించుకుంటారు.
శ్రావణమాసం మొత్తం పండుగలే పండుగలు. మొదటి 15 రోజుల్లో వరలక్ష్మీ వ్రతం, నాగపంచమి, రాఖీ పౌర్ణమి వస్తే..పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి నుంచి అమావాస్య వరకూ కూడా ప్రత్యేక రోజులే ఉంటాయని పండితులు చెబుతున్నారు.
శ్రావణమాసం పండుగల వివరాలు ఇవే..!
- జూలై 25: మొదటి శ్రావణ శుక్రవారం
- జూలై 29: మొదటి శ్రావణ మంగళవారం -
- ఆగష్టు 01 : రెండో శ్రావణ శుక్రవారం -
- ఆగష్టు 03 : ఫ్రెండ్ షిప్ డే
- ఆగష్టు 05 : శ్రావణ మంగళవారం -
- ఆగష్టు 08 : మూడో శ్రావణ శుక్రవారం , వరలక్ష్మీ వ్రతం
- ఆగష్టు 09 : జంధ్యాల పౌర్ణమి... రాఖీ పండుగ
- ఆగష్టు 12 : మూడో శ్రావణ మంగళవారం
- ఆగష్టు 15 : నాలుగో శ్రావణ శుక్రవారం
- ఆగష్టు 16: కృష్ణాష్ణమి
- ఆగష్టు 19 : నాలుగో శ్రావణ మంగళవారం
- ఆగష్టు 22: ఆఖరి శ్రావణ శుక్రవారం
- ఆగష్టు 23 : శనివారం పోలాల అమావాస్య తో శ్రావణమాసం ఆఖరి రోజు
- ఆగష్టు 24: ఆదివారం నుంచి బాధ్రపదమాసం ప్రారంభం