Single Box Office: శ్రీవిష్ణు కెరీర్లోనే సింగిల్ బ్లాక్‌బస్టర్..బ్రేక్ ఈవెన్ టార్గెట్, వసూళ్లు ఎన్ని కోట్లంటే?

Single Box Office: శ్రీవిష్ణు కెరీర్లోనే సింగిల్ బ్లాక్‌బస్టర్..బ్రేక్ ఈవెన్ టార్గెట్, వసూళ్లు ఎన్ని కోట్లంటే?

శ్రీవిష్ణు. కేతికా శర్మ, ఇవానా, వెన్నెల కిషోర్ నటీనటులుగా తెరకెక్కిన సినిమా సింగిల్. ఈ కామెడీ, లవ్ ఎంటర్టైనర్ మూవీ బాక్సఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కొట్టేసిన ఈ సినిమా లాభాలను అందిస్తోంది. కార్తీక్ రాజు డైరెక్ట్ చేసిన ఈ సినిమా 10రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసింది? ఎన్ని కోట్ల లాభాలను అందించిందనేది ఇపుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. వివరాల్లోకి వెళితే.. 

సింగిల్ బాక్సాఫీస్:

సింగిల్ మూవీని సుమారుగా 15 కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందించారు. ఈ నెల 9న సుమారుగా తెలుగు రాష్ట్రాల్లో 400 స్క్రీన్లలో, ప్రపంచవ్యాప్తంగా 700 స్క్రీన్లలో సింగిల్ సినిమాను రిలీజ్ చేశారు. ఈ మూవీ లాభాల్లోకి రావాలంటే రూ.8 కోట్ల షేర్, రూ.16 కోట్ల గ్రాస్ వసూళ్లతో బరిలో దిగింది. 

ALSO READ | Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ థర్డ్ సింగిల్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?

సాక్నిల్క్ ప్రకారం..  సింగిల్ 9 రోజుల వసూళ్లు సింగిల్ మూవీకి తొలి రోజు ఇండియాలో రూ.2.5 కోట్లు, రెండో రోజు రూ.3.5 కోట్ల నెట్, మూడో రోజు రూ.3.55 కోట్ల నెట్, నాలుగోరోజు రూ.1.7 కోట్లు, ఐదో రోజు రూ.1.58 కోట్లు, ఆరో రోజు రూ.1.17 కోట్లు, ఏడో రోజు రూ.1.1 కోట్లు, ఎనిమిదో రోజు రూ.1.32 కోట్లు, తొమ్మిదో రోజు రూ.1.83 కోట్లు చొప్పున 9 రోజుల్లో సింగిల్ మూవీ నికరంగా రూ.19 కోట్ల షేర్ సాధించినట్లు సాక్నిల్క్ తెలిపింది.

అలాగే ఓపర్సీస్ లో రూ.3.25 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ పండితులు చెప్పారు. రూ.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ దిశగా పరుగులు పెడుతోందీ మూవీ. గీతా ఆర్ట్స్, కళ్యా ఫిల్మ్స్ పతాకాలపై విద్య కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరిలు సంయుక్తంగా సింగిల్ చిత్రాన్ని నిర్మించారు.

సింగిల్ ఓటీటీ:

శ్రీ విష్ణు నటించిన సింగిల్ మూవీ ఓటీటీ హక్కులను ప్రైమ్ వీడియో దక్కించుకుంది. శ్రీ విష్ణు మూవీస్ కి ఓటీటీలో భారీ ప్రేక్షకాదరణ వస్తోంది. ఈ క్రమంలోనే సింగిల్ సినిమా ఓటీటీ హక్కులకు భారీ ధర పలికినట్లు సమాచారం.

ఇప్పటివరకూ శ్రీవిష్ణు నటించిన సినిమాలకు వచ్చిన అత్యధిక మొత్తం సింగిల్ మూవీకే రావడం విశేషం. అయితే, ఏ టీవీ ఛానెల్ శాటిలైట్ హక్కులను దక్కించుకుందో తెలియాల్సి ఉంది. 

ఇందులో శ్రీ విష్ణు ఇద్దరు అమ్మాయిల మధ్య చిక్కుకున్న ప్రేమికుడిగా నటించాడు. కార్తీక్ రాజు మంచి స్క్రిప్ట్ రాసుకున్నాడు. వెన్నెల కిషోర్- శ్రీవిష్ణు మధ్య వచ్చే ఫన్నీ ఎపిసోడ్స్తో మంచి బూస్ట్ ఇచ్చాడు. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఆడియన్స్కు ఎక్కడా బోర్ కొట్టకుండా తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు.

స్టార్ హీరోలను శ్రీవిష్ణు ఇమిటేట్ చేసే సీన్స్ అయితే, థియేటర్స్లో మోత మోగిపోయేలా చేసింది. కామెడీతో పాటు ఎమోషన్, రొమాంటిక్ సీన్లతో వచ్చిన సింగిల్.. జూన్ 6న స్ట్రీమింగ్కు వచ్చే అవకాశం ఉంది. అయితే, డేట్‍పై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ మూవీకి తమిళ డైరెక్టర్ కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంతోనే ఆయన తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు.