Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ థర్డ్ సింగిల్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?

Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ థర్డ్ సింగిల్  అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’.ఈ మూవీ జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్స్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు.

లేటెస్ట్గా సోమవారం మే19న హరిహర వీరమల్లు మూడో పాట అప్డేట్ అనౌన్స్ చేశారు. అసుర హననం (అసురులను సంహరించడం) పేరుతో పాట రానుందని తెలిపారు. బుధవారం జూన్ 21న ఉదయం 11:55గంటలకు రిలీజ్ కానుందని పోస్టర్ రిలీజ్ చేశారు. ఇప్పటికే రిలీజైన మాట వినాలి, కొల్లగొట్టి నాదిరో సాంగ్స్ ప్రేక్షకాదరణ పొందాయి.

పవన్ కళ్యాణ్ కెరియర్లోనే ఫస్ట్ టైం నటిస్తున్న పాన్ ఇండియా మూవీది. పీరియాడిక్ జోనర్ లో తెరకెక్కిన ఈ మూవీని రెండు భాగాలుగా రూపొందించారు. ‘హరిహర వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో మొదటిభాగం తెరకెకిక్కించారు. 

ALSO READ | Kannappa: కన్నప్ప కౌంట్ డౌన్ స్టార్ట్.. రిలీజ్ డేట్ లాక్.. 40 రోజుల్లో మంచు హీరో సునామీ

దర్శకుడు క్రిష్ కొంత భాగాన్ని తెరకెక్కించగా, జ్యోతి కృష్ణ బ్యాలెన్స్‌‌‌‌ షూట్‌‌‌‌ను డైరెక్ట్ చేశాడు. అయితే, ఈ మూవీ పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. మే 9న విడుదల కావల్సి ఉండగా మరోసారి వాయిదా పడింది. జూన్ 12న రాబోతుంది. ఇకపోతే ఈ మూవీకి సంబంధించిన మొదటి ప్రెస్ మీట్ మే 21న ఉదయం 11:00 గంటలకు జరగనుంది. 

మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎం రత్నం సమర్పిస్తున్న ఈ సినిమాను దయాకర్ రావు ప్రొడ్యూస్ చేస్తున్నారు. దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో.. పవన్ కల్యాణ్ బంధిపోటుగా కనిపించనున్నాడు. నిధి అగర్వాల్, అర్జున్ రాంపాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.