
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’.ఇందులో ప్రభాస్, కాజల్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్ లాంటి స్టార్స్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇందులోని ఒక్కొక్కరి పాత్రలను పరిచయం చేసిన మేకర్స్ సినిమాపై అంచనాలు పెంచారు.
శివుడిగా అక్షయ్ కుమార్ కనిపించనున్నారు. ఆయన శివ తాండవం చేస్తున్న పోస్టర్‌ను ఇప్పటికే రిలీజ్ చేయగా, ‘కన్నప్ప’కౌంట్ డౌన్ పోస్టర్ అంటూ అక్షయ్‌కు సంబంధించిన మరో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. జూన్ 27న విడుదల కానున్న ఈ సినిమా ఇంకా నలభై రోజుల్లో రానుందని మంచు విష్ణు ఈ పోస్టర్‌ను రిలీజ్ చేశాడు.
►ALSO READ | Prabhas Movies: మరింత వేగంతో ప్రభాస్.. హను, సందీప్ రెడ్డి వంగాల మూవీస్ అప్డేట్
ఇందులో అక్షయ్ విభూది, జడలతో రుద్రాక్షలు ధరించి శివుడి గెటప్‌లో ఆకట్టుకున్నారు. ముకేశ్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా మోహన్ బాబు నిర్మిస్తున్నారు.
Kannappa on June 27th. 40 days to go@akshaykumar #kannappa #harharmahadevॐ pic.twitter.com/AWKe2bHkzs
— Vishnu Manchu (@iVishnuManchu) May 18, 2025
ఈ మూవీకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ, స్టీఫెన్ దేవస్సే మ్యూజిక్, బీజీఎం అందిస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల పై మంచు మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మరి మంచు ఫ్యామిలీలోనే ప్రెస్టీజియస్ ప్రాజెక్టు గా వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.