
వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఇప్పటికే ‘రాజా సాబ్’షూటింగ్‌ను పూర్తి చేసి రీసెంట్‌గా వెకేషన్‌కు వెళ్లాడు. ఈ మధ్యనే హైదరాబాద్‌కు తిరిగి రావడంతోనే ‘రాజా సాబ్’డబ్బింగ్ పనులు మొదలుపెట్టాడట.
డైరెక్టర్ మారుతి ఈ చిత్రాన్ని రూపొందిస్తుండగా, ప్రభాస్ కెరీర్‌లో ఫస్ట్ టైమ్ హారర్ జానర్‌లో నటిస్తుండడంతో ఆసక్తి నెలకొంది. త్వరలోనే టీజర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
HIGH ALERT…‼️
— Director Maruthi (@DirectorMaruthi) April 23, 2025
HEAT WAVES gonna rise even higher from mid May! 🔥🔥🔥 pic.twitter.com/EdEdtMCq6E
ఇప్పటికే విడుదలైన ప్రభాస్ లుక్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్‌దత్ కీలకపాత్ర పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
మరోవైపు హను రాఘవపూడి రూపొందిస్తున్న చిత్రాన్ని కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు ప్రభాస్. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తవగా, ఈ వారంలో నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్‌తో పాటు ముఖ్య పాత్రధారులంతా పాల్గొనబోతున్నారని తెలుస్తోంది.
#PrabhasHanu pic.twitter.com/jF7ZKgThw6
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) August 17, 2024
దాదాపు నలభై ఐదు రోజులపాటు ఈ షెడ్యూల్ని ప్లాన్ చేసుకున్నారట. ఈ షెడ్యూల్‌తో ప్రభాస్ పోర్షన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే చాన్స్ ఉందని సమాచారం. ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇక వీటి తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో తెరకెక్కనున్న‘స్పిరిట్’సినిమాను కూడా అతి త్వరలో ప్రారంభించేలా ప్రభాస్ ప్లాన్ చేస్తున్నాడు.