Karaali: ‘కరాలి’ షురూ.. డిఫరెంట్ యాక్షన్ డ్రామాతో నవీన్ చంద్ర

Karaali: ‘కరాలి’ షురూ.. డిఫరెంట్ యాక్షన్ డ్రామాతో నవీన్ చంద్ర

నవీన్ చంద్ర హీరోగా కొత్త చిత్రం ప్రారంభమైంది. రాకేష్ పొట్టా దర్శకత్వంలో  ‘కరాలి’టైటిల్‌‌‌‌తో  మందలపు శివకృష్ణ ఈ చిత్రాన్ని  నిర్మిస్తున్నారు. రాశీ సింగ్, కాజల్ చౌదరి హీరోయిన్స్‌‌‌‌గా నటిస్తున్నారు. ఆదివారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు.

అతిథిగా హాజరైన నిర్మాత సాహు గారపాటి హీరో హీరోయిన్‌‌‌‌పై క్లాప్ కొట్టగా, యాస్పైర్ స్పేసెస్ మేనేజింగ్ డైరెక్టర్ తుమాటి న‌‌‌‌ర‌‌‌‌సింహా రెడ్డి కెమెరా స్విచాన్ చేశారు. ఈ సందర్భంగా నవీన్ చంద్ర మాట్లాడుతూ ‘ఈ టైటిల్ ఎంత కొత్తగా, డిఫరెంట్‌‌‌‌గా ఉందో సినిమా కూడా అంతే కొత్తగా ఉంటుంది. ఇంతవరకు నేను చేయని ఓ డిఫరెంట్ యాక్షన్ డ్రామా ఇది’అని చెప్పాడు.

►ALSO READ | Trailer Review: వారాహి ఆలయ భూములను మంత్రి ఆక్రమణ.. రక్షించేందుకు బరిలో ముగ్గురు మొనగాళ్లు

మంచి టీమ్‌‌‌‌తో వర్క్ చేసే అవకాశం రావడం హ్యాపీ అంది కాజల్ చౌదరి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తామని దర్శక నిర్మాతలు తెలియజేశారు.   గరుడ రాముడు, రాజా రవీంద్ర , వెంకటేష్ ముమ్మిడి ఇతర పాత్రలు పోషిస్తున్నారు. వికాస్ బడిసా సంగీతం అందిస్తున్నాడు.