టాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ గా ఎంట్రీ ఇచ్చి, షార్టెటైంలోనే స్టార్ స్టేటస్ అందుకున్న హీరోయిన్ శ్రీలీల. తన ఎనర్జిటిక్ స్టెప్పులు, క్యూట్ ఎక్స్‍ప్రెషన్స్ తో కుర్రాళ్ల మనసు దోచుకుంటోందీ భామ. అటు గ్రామర్ విషయంలోనూ ఏమాత్రం తగ్గట్లేడు. మోడ్రన్ డ్రెస్సుల్లో ట్రెండీగా, సంప్రదాయ దుస్తుల్లో మెరుస్తూ కనిపిస్తోంది. లేటెస్ట్ గా శ్రీలీల షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్అవుతున్నాయి.
క్రీమ్ కలర్ డిజైనర్ లెహంగాలో అచ్చం దేవకన్యలా మెరిసిపోతుంది శ్రీలీల. ఆ దుస్తులపై ఉన్న షైనింగ్. ఆమె చర్మానికి తగ్గట్టుగా బ్లెండ్ అయ్యి, ఒక పాలరాతి శిల్పంలా కనిపిస్తుంది. మెడలో హెవీ డైమండ్ సెట్. చెవులకు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, నుదుటిన పాపిట బిళ్లతో ధరించిన ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జడలో మల్లెపూలు పెట్టుకుని, వాటి సువాసనలు వెదజల్లుతున్నట్లుగా ఆమె ఇచ్చిన పోజులకు అభిమానులు ఫిదా అవుతున్నారు.
ప్రస్తుతం శ్రీలీల చేతిలో ఐదారు బడా ప్రాజెక్టులు ఉన్నాయి. ఇటీవలే ఓ స్పెషల్ సాంగ్ తో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ . తమిళంలో 'పరాశక్తి', తెలుగులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన 'ఉస్తాద్ భగత్ సింగ్ ' మూవీలో నటిస్తుంది. ఇక బాలీవుడ్ లోనూ ఆమె ఎంట్రీకి రంగం సిద్ధ మైంది. అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తో న్న ఓ సినిమా అడుగుపెట్టనుంది.
