పుష్ప 2 సెట్స్ నుంచి స్పెషల్ సాంగ్ పిక్స్ లీక్..

పుష్ప 2 సెట్స్ నుంచి స్పెషల్ సాంగ్ పిక్స్ లీక్..

టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2 కోసం అల్లు అర్జున్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించినప్పటికీ టీజర్, ట్రైలర్ అప్డేట్లు మాత్రం ఇవ్వలేదు. దీంతో రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న సమయంలో అభిమానులు నిరాశ చెందుతున్నారు. అయితే మరోవైపు పుష్ప 2 లోని స్పెషల్ సాంగ్ లో నటించే హీరోయిన్ ఎవరనే విషయంపై రోజుకో గాసిప్ వినిపిస్తోంది. 

పుష్ప 2 లోని స్పెషల్ సాంగ్ కోసం చిత్ర యూనిట్ యంగ్ బ్యూటీఫుల్ హీరోయిన్ శ్రీలీల ని తీసుకున్నట్లు పలు వార్తలు బలంగా వినిపించాయి. అయితే తాజాగా  పుష్ప 2 సెట్స్ నుంచి శ్రీలీల మరియు అల్లు అర్జున్ కలసి నటిస్తున్న ఫోటో లీక్ అయ్యింది. ప్రస్తుతం పుష్ప 2 స్పెషల్ సాంగ్ కోసం హైదరాబాద్ లో భారీగా సెట్స్ వేసి ఘాట్ చేస్తున్నారు. ఈ సెట్స్ నుంచి ఫోటో లీక్ అయినట్లు సమాచారం. దీంతో అల్లు అర్జున్ అభిమానులు ఈ ఫోటోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మొత్తానికి పుష్ప 2 లోని స్పెషల్ సాంగ్ పై క్లారిటి వచ్చిందని మరికొందరు అంటున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా పుష్ప 2 రిలీజ్ కి ముందే రూ.1020 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. కాగా ఇటీవలే ఓవర్సీస్ లో టికెట్ల బూకింగ్స్ ఓపెన్ చెయ్యగా కనీసం ట్రైలర్ కూడా రిలీజ్ కాకముందే చాలా ఫాస్ట్ గా 5 లక్షల టికెట్లు సేల్ అయ్యాయి. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అఫిషియల్ గా ప్రకటించింది.