కటౌటు.. ఘాటు.. స్వీటు.. రైమింగ్తో అదరగొట్టిన శ్రీలీల ఫ్యాన్స్

కటౌటు.. ఘాటు.. స్వీటు.. రైమింగ్తో అదరగొట్టిన శ్రీలీల ఫ్యాన్స్

హిట్టు.. ప్లాప్.. విషయం పక్కన పెడితే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీలీల(Sreeleela) హవా నడుస్తోంది. సినిమా ఏదైనా.. హీరో ఎవరైనా.. హీరోయిన్ మాత్రం శ్రీలీలనే అంటున్నారు మేకర్స్. పెళ్లి సందD(Pelli SandaD) మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. రవితేజతో చేసిన ధమాఖా(Dhamaka) మూవీతో స్టార్ హీరోయిన్ గా మారింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ తరువాత వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ అందుకుంది శ్రీలీల. దాంతో ఆమెకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది.

తాజాగా ఆమె నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి మిక్సుడ్ టాక్ వచ్చింది. అయినప్పటికి సూపర్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది ఈ మూవీ. ఇక సినిమాలో శ్రీలీల మాస్ డాన్స్ కుక్ కుర్రకారు ఫిదా అవుతున్నారు. మరీ ముఖ్యంగా ఆమె ఫ్యాన్స్ నా నా హంగామా చేస్తున్నారు. అయితే తాజాగా ఆమెకు సంబందించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అదేంటంటే.. గుంటూరు కారం సినిమా రిలీజ్ సందర్బంగా థియేటర్ వద్ద శ్రీలీల బ్యానర్ ఏర్పాటు చేశారు ఆమె ఫ్యాన్స్. స్టార్ హీరో మహేష్ బాబును సైతం పక్కన పెట్టేసి శ్రీలీల బ్యానర్ ఏర్పాటుచేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు శ్రీలీల ఫ్యాన్స్. ఆ బ్యానర్ లో గుంటురు కారం ఘాటు.. మూవీకి శ్రీలీల క్యూటు.. అనే లైన్స్ ను యాడ్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ అవాక్కవుతున్నారు. ఇదేం క్రేజ్ శ్రీలీల అంటూ కామెంట్స్ చేస్తున్నారు.