శ్రీలీల షాకింగ్ డెసిషన్.. ఇంత పీక్ టైంలోనా?

శ్రీలీల షాకింగ్ డెసిషన్.. ఇంత పీక్ టైంలోనా?

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ఎవరంటే ఠక్కున గుర్తిచ్చే పేరు శ్రీలీల(Sreeleela). ఒకరు కాదు ఇద్దరు కాదు ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోలందరితో సినిమాలు చేస్తోంది ఈ బ్యూటీ. పెళ్లి సందD సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న శ్రీలీల.. ఆతరువాత రవితేజ తో ధమాక చేసి బ్లాక్ బస్టర్ అందుకుంది. దీంతో టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా మరిపోయింది.    

కానీ ఆతరువాత న్యూడ్ బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది ఈ బ్యూటీకి. వరుసగా క్రేజీ అవకాశాలు దక్కించుకుంది కానీ.. విజయాలు మాత్రమే ఆమెను వరించలేదు. ఇటీవల ఆమె నుండి వచ్చిన స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రా సినిమాలు భారీ ఫ్లాప్స్ గా నిలిచాయి. అయితే ఈ అమ్మడు తాజాగా షాకింగ్ డెసిషన్ తీసుకుందట. ప్రస్తుతం ఆమె మెడిసిన్ చదువుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు అటు సినిమాలను, ఇటు చదువును బ్యాలెన్స్ చేస్తూ వచ్చింది. కానీ.. త్వరలో మెడిసిన్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయట, అందుకోసం కొన్ని రోజులపాటు సినిమాలకు చిన్న బ్రేక్ ఇవ్వనుందట శ్రీలీల. ఈ న్యూస్ తెలుసుకున్న శ్రీలీల ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు.

ఇక ప్రస్తుతం శ్రీలీల చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్, మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో గుంటూరు కారం,విజయ్ దేవరకొండతో, నవీన్ పోలిశెట్టి, నితిన్, సిద్దు జొన్నగడ్డ టాప్ స్టార్స్ అందరితో సినిమాలు చేస్తోంది శ్రీలీల. ఈ సినిమాలు వచ్చే ఏడాది ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.