
సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఇకనుంచి ఎస్ ఆర్ హెచ్ ఫ్యాన్ జెర్సీని ధరించి ఐపీఎల్ మ్యాచ్ చూసేలా క్రికెట్ అభిమానులకు యాజమాన్యం ఆఫర్ ప్రకటించింది. మే 8న సొంతగడ్డ ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్ కోసం ఎస్ఆర్ హెచ్ యాజమాన్యం ఫ్యాన్ జెర్సీని తీసుకొచ్చింది. ఈ మ్యాచ్ కోసం ఏప్రిల్ 18వ తేదీ గురువారం ఆన్ లైన్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేసింది. టికెట్ బుక్ చేసుకునేవారికి ప్రతి రెండు టికెట్లపై ఒక ఫ్యాన్ జెర్సీని ఫ్రీగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
Also Read: చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్
కాగా, ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుత ఆటతో అదరగొడుతోంది. ఈ సీజన్ లో రెండు మ్యాచ్ ల్లో ఎస్ఆర్ హెచ్ ఓడినా.. గెలుపు కోసం చివరివరకు పోరాడిన తీరు అభిమానులకు ఆకట్టకుంది. ఇక, ముంబైతో జరిగిన మ్యాచ్ లో ఏకంగా 277 పరుగుల రికార్డు స్కోరుతో అదరగొట్టింది. గత చివరి మ్యాచ్ లోనూ బెంగళూరు జట్టుపై 288 పరుగుల భారీ స్కోరు చేసి చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్ లు ఆడిన ఎస్ఆర్ హెచ్.. నాలుగింట్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్తానంలో కొనసాగుతోంది.
? ?????? ?????? ?#OrangeArmy grab your tickets for #SRHvLSG at Uppal! ??️
— SunRisers Hyderabad (@SunRisers) April 18, 2024
Click the link below and buy yours now ⬇️?#PlayWithFire @paytminsider
మే 8న సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల విక్రయాలు మొదలయ్యాయి. ఆసక్తి ఉన్నవారు బుక్ చేసుకోవచ్చు. ప్రారంభ ధర రూ. 750 మాత్రమే.