- రూ. 30 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు
హైదరాబాద్, వెలుగు: నగర శివార్లలోని సుల్తాన్‌పూర్‌లోని టీఎస్‌ఐఐసీలో 1.5 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన బయో ఈస్తెటిక్స్, ఇంటిగ్రేటెడ్ అగ్రిబయోటెక్ సెంటర్ ఆదివారం ప్రారంభమైంది. రూ.30 కోట్ల పెట్టుబడితో దీన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆర్&డీ, ఉత్పత్తి, సర్వీసులు ఉంటాయి. ఈ సదుపాయంలో పరిశోధనలను నిర్వహించడమే కాకుండా పంటలకు అవసరమైన సలహాలను సూచనలను కూడా ఇస్తామని బయో ఈస్తెటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ కేఆర్కే రెడ్డి అన్నారు.
రైతులు తమ పంటభూమి లక్షణాలను అర్థం చేసుకోవడానికి ‘మై అగ్రిబయోమ్’ అనే అసెస్‌మెంట్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ను కూడా ఈ సందర్భంగా ప్రారంభించారు. ఈ కేంద్రం వివిధ రంగాలకు చెందిన శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు కలిసి సహకరించడానికి వేదికగా ఉంటుంది.
