
కిరణ్ అబ్బవరం హీరోగా ‘క’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను రూపొందించిన శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ 'శ్రీ చిదంబరం’ అనే న్యూఏజ్ కాన్సెప్ట్ మూవీని నిర్మిస్తోంది. వంశీ తుమ్మల, సంధ్య వశిష్ట జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి వినయ్ రత్నం దర్శకుడు. చింతా వినీషా రెడ్డి, చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మిస్తున్నారు. సోమవారం ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌ను హీరో కార్తికేయ విడుదల చేసి టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు.
అనంతరం నిర్మాతలు మాట్లాడుతూ ‘యంగ్ టీమ్ అంతా కలిసి ఫ్రెష్ ఫీల్‌తో చేసిన సినిమా ఇది. మెల్లకన్ను ఉన్న యువకుడు ఇన్‌సెక్యూర్‌తో కళ్ళద్డాలు పెట్టుకుని లైఫ్‌ని మేనేజ్ చేస్తుంటాడు. అలాంటి అబ్బాయి లవ్‌లో పడితే ఏం జరుగుతుంది అనేది కథ. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఫన్ డ్రామాగా తెరకెక్కించాం. సహజత్వానికి దగ్గరగా, కొత్తదనం కోరుకునే వాళ్లకు సంతృప్తినిచ్చేలా ఉంటుంది’ అని చెప్పారు.