నిర్మాతగా మారుతున్న యువ దర్శకుడు

నిర్మాతగా మారుతున్న యువ దర్శకుడు

దర్శకత్వశాఖలో మంచి అనుభవం కలిగి, "ప్రేమంటే సులువు కాదురా" చిత్రంతో దర్శకుడిగా పరిచయమై యువ ప్రతిభాశాలి "చందా గోవిందరెడ్డి". తొలి చిత్రంతోనే తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఇతను ఇప్పుడు నిర్మాతగా మారుతున్నాడు. చందా గోవిందరెడ్డి స్వీయ దర్శత్వంలో ఓ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. తన సొంతూరులో విలసిల్లుతున్న శ్రీ ఇష్ట కామేశ్వర స్వామి పేరిట "శ్రీ ఇష్ట కామేశ్వర క్రియేషన్స్" నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు.

ఈ నేపథ్యంలో "శ్రీ ఇష్ట కామేశ్వర క్రియేషన్స్" లోగోను సంచలన దర్శకుడు వి.వి.వినాయక్ ఇవాళ ఆవిష్కరించారు. అలాగే సీనియర్ దర్శకులు కె.సాగర్ ఈ కార్యక్రమంలో పాల్గొని చందా గోవిందరెడ్డికి శుభాశీస్సులు అందించారు. తన చేతుల మీదుగా శ్రీకారం చుట్టుకున్న "శ్రీ ఇష్ట కామేశ్వర క్రియేషన్స్" అంచెలంచెలుగా ఎదగాలని... టాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థల జాబితాలో చోటు సంపాదించుకోవాలని వి.వి.వినాయక్ ఆకాంక్షించారు.

సీనియర్ దర్శకులు సాగర్ సమక్షంలో సెన్సేషనల్ డైరక్టర్ వి.వి.వినాయక్ మా "శ్రీ ఇష్ట కామేశ్వర క్రియేషన్స్" లోగో లాంచ్ చేయడం చాలా గర్వంగా ఉందని చందా గోవిందరెడ్డి అన్నారు. తమ బ్యానర్ లో రూపొందే చిత్రం వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో "రఫ్" చిత్ర దర్శకులు సుబ్బారెడ్డి, సీనియర్ కో-డైరక్టర్ రమేష్ రెడ్డి పాల్గొన్నారు.