యాదగిరిగుట్ట ఆలయ ఉద్యోగి సస్పెన్షన్

యాదగిరిగుట్ట ఆలయ ఉద్యోగి సస్పెన్షన్

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో రికార్డు అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తున్న యాద గిరిపై సస్పెన్షన్ వేటు పడింది. వివరాల్లోకి వెళ్తే.. యాదగిరి కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డు ఎంట్రీ వద్ద ఆర్టీసీ బస్సులు నిర్వహణ డ్యూటీ నిర్వహిస్తున్నాడు. కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలోకొనసాగుతున్న కొండపైకి వాహన రుసుముప్రవేశం కౌంటర్లో టికెట్ల రీసేల్ వ్యవహా రంలో ఇన్వాల్వ్ అయినట్లు దేవస్థానానికిఫిర్యాదులు అందాయి.

ఆలయ ఆఫీసర్లు విచారణచేపట్టగా.. యాదగిరిఓ హోంగార్డు, పార్కింగ్ సిబ్బంది, కెనరా బ్యాంక్ సిబ్బంది తో కలిసి టికెట్ల (రూ.500) రీసేల్ లో ఇన్వా ల్వ్ అయినట్లు నిర్ధారణ అయింది. దీంతో అతన్ని సస్పెండ్ చేస్తూ ఆలయ పరిపాలనా విభాగం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. హోంగార్డు నర్సింహ్మను భువనగిరి ఏఆర్ హెడాఫీస్ కు అటాచ్ చేసినట్లు తెలిసింది.