మనోహరంగా శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్యవిమాన రథోత్సవం

మనోహరంగా  శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్యవిమాన రథోత్సవం

పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి దివ్యవిమాన రథోత్సవాన్ని మనోహరంగా నిర్వహించారు. గురువారం రాత్రి ఆండాళ్ అమ్మవారిని పెండ్లాడిన నారసింహుడిని శుక్రవారం ఆలయ ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యుల ఆధ్వర్యంలో అందంగా ముస్తాబు చేసి దివ్యరథంలో అధిష్ఠింపజేశారు. 

అనంతరం వేదపారాయణాలు, అర్చకుల మంత్రోచ్ఛరణలు, సన్నాయి మేళాలు, మంగళ వాయిద్యాల మధ్య తిరువీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా యువకులు డ్యాన్సులు చేస్తూ, మహిళలు కోలాటాలు ఆడుతూ సందడి చేశారు.  ఉదయం స్వామివారికి గరుడ వాహన సేవ జరిపారు.  ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రామకృష్ణారావు, చైర్మన్ నర్సింహమూర్తి, డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్ శర్మ, ఏఈవో గజవెల్లి రమేష్ బాబు పాల్గొన్నారు. ‌‌‌‌ 

యాదగిరిగుట్ట, వెలుగు