ఇండియన్ టూరిస్టుల కోసం.. శ్రీలంక ఫ్రీ వీసా

ఇండియన్ టూరిస్టుల కోసం.. శ్రీలంక ఫ్రీ వీసా

శ్రీలంక టూర్కు వెళ్లాలనుకుంటున్నారా.. ద్వీపంలోని వీసా కోసం చూస్తున్నారా..  ఈ చిన్న ద్వీపం అందాలు, అక్కడి వాతావరణాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటు న్నారా.. టెన్షన్ అవసరం లేదు.. ఇప్పుడు శ్రీలంక వెళ్లాలంటే వీసా కోసం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫ్రీ వీసా. పాస్ పోర్ట్ ఉంటే చాలు.. ఎలాంటి డబ్బులు చెల్లించకుండానే ఫ్రీగానే వీసా ఇచ్చేస్తుంది శ్రీలంక. చెన్నై నుంచి గంటలో కొలంబో చేరుకోవచ్చు.  అందమైన ద్వీపం శ్రీలంక అందాలు ఎంజాయ్ చేయాలనుకునే ఇండియన్ టూరిస్టులకు  ఎలాంటి ఛార్జీలు లేకుండా శ్రీలంక ఉచితంగా వీసాలు జారీ చేస్తోంది. 

ఆర్థిక సంక్షోభం, శ్రీలంకలో ప్రస్తుత పరిస్థితుల ఎదుర్కొనేందుకు ఆ దేశ ప్రధాన ఆర్థిక వనరు అయిన టూరిజం డెవలప్ చేయాలని అక్కడి ప్రభుత్వం వివిధ దేశాల నుంచి వచ్చే టూరిస్టులకు ఫ్రీ వీసాలు జారీ చేస్తోంది. భారత్ తో సహా ఆరు దేశాలకు చెందిన టూరిస్టులకు ఉచితంగా వీసాలు ఇవ్వాలని శ్రీలంక కేబినెట్ నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్ట కింద భారత్,  చైనా, రష్యా, మలేషియా, జపాన్, ఇండోనేషన్, థాయ్ లాండ్ వంటి దేశాల పర్యాటకులకు పైలట్ ప్రాజెక్టు కింద 2024 మార్చి 31 వరకు ఉచిత వీసాలను అందిస్తోంది. 

Also Read: నాలుగేండ్లకే తూములు కొట్టుకుపోతయా?

ఈ దేశాలనుంచి వచ్చే పర్యాటకులకు ఎటువంటి ఛార్జీలు లేకుండా శ్రీలంక వీసాలు జారీ చేస్తోంది. టూరిజం లెక్కల ప్రకారం... భారత్ నుంచి నెలకు 30 వేల మంది భారతీయులు శ్రీలంక టూర్ కు వెళ్తుంటారు. శ్రీలంక టూరిజంలో 26 శాతం  ఇండియన్ టూరిస్టులే ఉన్నారు. తర్వాత చైనా నుంచి 8 వేల మంది టూరిస్టులు వస్తున్నట్లు గణాంకాలు చెపుతున్నాయి. టూరిజం డెవలప్ మెంట్ ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టుకునే ప్రయత్నం శ్రీలంక ప్రయత్నిస్తోంది.