పాకిస్తాన్ 252/7.. శ్రీలంక 252/8.. మరి లంకేయులు ఎలా గెలిచారు..?

పాకిస్తాన్ 252/7.. శ్రీలంక 252/8..  మరి లంకేయులు ఎలా గెలిచారు..?

ఆసియా కప్ లో భాగంగా నిన్న జరిగిన సూపర్-4 మ్యాచులో శ్రీలంక రెండు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచులో అసలంక విన్నింగ్ రన్స్ కొట్టి లంకను ఫైనల్ కి చేర్చాడు. కుశాల్ మెండిస్ (91) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడగా.. సదీర్ సమరవిక్రమ (48) రాణించాడు. అయితే ఈ మ్యాచులో ఫ్యాన్స్ ని ఒక అనుమానం  వెంటాడుతుంది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 252 పరుగులు చేస్తే సరిగ్గా శ్రీలంక కూడా అన్నే పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కి వెళ్ళాలి కదా.. శ్రీలంకను ఎలా విజేతగా ప్రకటించారు? అనుకుంటున్నారు. 

పలుమార్లు వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచులో మొదట 45 ఓవర్లకు ఆ తర్వాత 42 ఓవర్లకు మ్యాచుని కుదించారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. పాక్ ఇన్నింగ్స్ అనంతరం లంక టార్గెట్ ని డక్ వర్త్ లూయిస్ 252 గా ప్రకటించాడు. సాధారణంగా ఒక 5 లేదా 10 పరుగులు వ్యత్యాసం ఉంటే ఈ టార్గెట్ పై అంత చర్చ ఉండేది కాదు. కానీ ఒక్క పరుగే ఉండేసరికి అభిమానులు ఆశ్చర్యానికి గురైయ్యారు. కొంతమందికైతే శ్రీలంక గెలిచేవరకు ఇద్దరి స్కోర్లు సమంగా ఉన్నాయనే సంగతి గ్రహించలేకపోయారు.
   
ఒకవేళ వర్షం అంతరాయం కలిగించకపోతే పాక్ స్కోరు కూడా అదే కాబట్టి.. లంక 253 పరుగులు చేస్తే గెలిచేది. కానీ పలుమార్లు వర్షం పడడంతో డీఎల్ఎస్ లంక టార్గెట్ ని 252 గా నిర్ణయించారు. కాబట్టి డీఎల్ఎస్ నిర్ణయం ఫైనల్ కావడంతో ఈ విషయంపై ఎవరూ ఏమి చేయలేరు. సాధారణ మ్యాచ్ అయితే మ్యాచ్ సూపర్‌ ఓవర్‌కు వెళ్లాల్సింది. కానీ డీఎల్ఎస్ విధానం వల్ల మ్యాచ్ శ్రీలంక సొంతమైంది.