ఈ నెల 13న రాజపక్స రాజీనామా చేస్తారు

ఈ నెల 13న రాజపక్స రాజీనామా చేస్తారు

శ్రీలంక ఆర్థిక సంక్షోభం దృష్ట్యా అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామాకు అంగీకరించారు. ఈ నెల 13న రాజపక్స రాజీనామా చేస్తారని  ప్రధాని కార్యాలయం తెలిపింది. దీంతో రాజకీయ పార్టీలు అఖిల పక్ష ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. శనివారం నిరసనకారులు అధ్యక్ష భవనంపై దాడి చేయడంతో.. గొటబాయ పరారయ్యారు. ఈ నేపథ్యంలో  జులై 13న రాజీనామా చేస్తానని పార్లమెంట్ స్పీకర్ మహింద యాపా అబేవర్ధనకు తెలిపారు గొటబాయ. అఖిల పక్ష ఏర్పాటుకు వీలుగా శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే కూడా పదవి నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. దేశంలోని పలు ప్రధాన పార్టీలు నిన్న సమావేశమయ్యాయి. ఐక్య ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరించాయి.

మరోవైపు శనివారం ఐదుగురు మంత్రులు రాజీనామా చేశారు. నిరసనకారులు గొటబాయ నివాసంలోనే ఉంటున్నారు. గొటబాయ ఇంట్లో 8 కోట్ల నగదు గుర్తించారు. ఈ వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ గామారాయి. అధ్యక్ష నివాసం దగ్గరే వంటావార్పు చేస్తున్నారు నిరసనకారులు. రాజీనామా చేసేవరకు అధ్యక్ష భవనం వీడేది లేదన్నారు నిరసనకారులు.