శ్రీలంకలో భూకంపం.. ఊగిపోయిన కొలంబో

శ్రీలంకలో భూకంపం.. ఊగిపోయిన కొలంబో

శ్రీలంక రాజధాని కొలంబోలో భారీ భూకంపం సంభవించింది.  నవంబర్ 14   మధ్యాహ్నం 12.30 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై  తీవ్రత 6.2గా నమోదయ్యింది. స్థానికులంతా భయంతో ఒక్కసారిగా పరుగులు తీశారు. నగరం మొత్తం ఊగిపోయింది. కొన్ని ఇండ్లకు పగుళ్లు వచ్చాయి.   కోలంబోకు ఆగ్నేయ దిశగా 1326 కి.మీ దూరంలో 10 కిలోమీటర్ల లోతున భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) వెల్లడించింది. 

భూకంపం వల్ల పెద్దగా ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. అయితే తక్షణ భూకంప వల్ల   శ్రీలంకకు ఎలాంటి సునామీ ముప్పు లేదని  జియోలాజికల్ సర్వే వెల్లడించింది.  గత రెండు రోజులు గా దక్షిణ సూడాన్, ఉంగాడా, తకికిస్తాన్,ఇండోనేషియాలో కూడా భూకంపాలు వస్తున్నాయి. 

భారత దేశంతో పాటు ప్రపంచ  వ్యాప్తంగా పలు దేశాల్లో భూకంపాలు వస్తున్నాయి. ఇటీవల నేపాల్ లో భూకంపం దాటికి వందకు మంది సజీవదహనం అయిన సంగతి తెలిసిందే.. నవంబర్ 11న ఢిల్లీ ,యూపీలోని నోయిడాలోనూ భూకంపనాలు వచ్చాయి.