Crickek World Cup 2023 : టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న శ్రీలంక.. ఇది మాకు ఫైనల్ అంటున్న కమ్మిన్స్

Crickek World Cup 2023 : టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న శ్రీలంక.. ఇది మాకు ఫైనల్ అంటున్న కమ్మిన్స్

వరల్డ్ కప్ లో భాగంగా నేడు మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. నెదర్లాండ్స్ లాంటి చిన్న జట్టుని పక్కన పెడితే ఆస్ట్రేలియా, శ్రీలంక లాంటి జట్లు ఇంకా బోణీ కొట్టలేదు. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లో ఆసీస్, లంక జట్లు ఓడిపోవడంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు చావో రేవో లా మారింది. ఈ మ్యాచులో ఓడిపోయిన జట్టుకు సెమీస్ అవకాశాలు మరింతగా సంక్లిష్టం అవుతాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచులో గెలిచి ఎవరు కంబ్యాక్ ఇస్తారో చూడాలి. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచులో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. కాగా.. ఈ మ్యాచ్ మాకు ఫైనల్ లాంటిదని కమిన్స్ చెప్పుకొచ్చాడు.   

ఆస్ట్రేలియా  తుది జట్టు: 

మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్(కెప్టెన్ ), ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్

శ్రీలంక తుది జట్టు: 

పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, కుసల్ మెండిస్(కెప్టెన్, వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, చమిక కరుణరత్నే, దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, లహిరు కుమార, దిల్షన్ మధుశంక