
ఆసియా కప్ లో శనివారం (సెప్టెంబర్ 20) నుంచి సూపర్-4 మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. లీగ్ మ్యాచ్ లు ముగిసిన తర్వాత ఒక రోజు కూడా గ్యాప్ లేకుండా సూపర్-4 ను నిర్వహిస్తున్నారు. తొలి మ్యాచ్ లో ఆసక్తికర సమరం జరగనుంది. ఈ టోర్నీలో వరుస విజయాలతో సూపర్ ఫామ్ లో ఉన్న శ్రీలంకతో బంగ్లాదేశ్ తలపడనుంది. సూపర్-4 లో ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలని ఇరు జట్లు గట్టి పట్టుదలతో ఉన్నాయి. శ్రీలంక, బంగ్లా మ్యాచ్ అంటే సగటు క్రికెట్ ఫ్యాన్ ను నాగిని డ్యాన్స్ గుర్తొస్తుంది. ఈ రెండు జట్ల మధ్య కొన్నేళ్లుగా నాగిని డ్యాన్స్ సెలెబ్రేషన్ కొనసాగుతూ వస్తోంది.
ఈ సారి కూడా ఫ్యాన్స్ రెండు జట్ల మధ్య థ్రిల్లింగ్ మ్యాచ్ ఆశిస్తున్నారు. మ్యాచ్ శనివారం (సెప్టెంబర్ 20) రాత్రి 8 గంటలకు సోనీ స్పోర్ట్స్ లో ప్రత్యక్ష ప్రసారమవుతోంది. రెండు జట్ల బలాబలాలు పరిశీలిస్తే శ్రీలంక ఫేవరేట్ గా బరిలోకి దిగబోతుంది. ఈ టోర్నీ లీగ్ లో ఆడిన మూడు మ్యాచ్ ల్లో శ్రీలంక ఘన విజయం సాధించింది. మరోవైపు బంగ్లాదేశ్ ఒక మ్యాచ్ లో ఓడిపోయి రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో శ్రీలంకనే విజయం సాధించింది. లీగ్ మ్యాచ్ లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని బంగ్లా భావిస్తుంటే.. సూపర్ ఫామ్ ను కొనసాగిస్తూ మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని లంక భావిస్తోంది.
ALSO READ : పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ దూరం..?
శ్రీలంక బ్యాటింగ్ అదుర్స్.. బౌలింగ్ పైనే బంగ్లా భారం:
నేడు జరగనున్న మ్యాచ్ లో శ్రీలంక బ్యాటింగ్ బంగ్లాదేశ్ బౌలింగ్ మధ్యే అసలు సమరం జరగనుంది. శ్రీలంక జట్టులో బ్యాటర్లందరూ ఫామ్ లో ఉన్నారు. ఓపెనర్ నిస్సంక, కుశాల్ మెండీస్ లలో ఒకరు క్రీజ్ లో చివరి వరకు ఉంటున్నారు. కుశాల్ పెరీరా, అసలంక ఫామ్ లోకి వస్తే లంక జట్టుకు తిరుగుండదు. లోయర్ ఆర్డర్ లో శనక, కామిందు మెండీస్ రూపంలో పవర్ ఫుల్ హిట్టర్లు ఉన్నారు. కొత్త కుర్రాడు మిశ్రా తొలి టోర్నీ అయినప్పటికీ ఆకట్టుకుంటున్నాడు. మరోవైపు బంగ్లాదేశ్ బౌలింగ్ దుర్బేధ్యంగా కనిపిస్తుంది. సీనియర్లు తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ ఆ జట్టుకు అత్యంత బలం. మెహదీ హసన్, రిషద్ హుస్సేన్ రూపంలో స్పిన్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది.
శ్రీలంక ప్లేయింగ్ 11 (అంచనా):
పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), కమిల్ మిషార, కుసల్ పెరెరా, చరిత్ అసలంక (కెప్టెన్), దసున్ షనక, కమిందు మెండిస్, వనిందు హసరంగా, దునిత్ వెల్లలగే, దుష్మంత చమీర, నువాన్ తుషార
బంగ్లాదేశ్ ప్లేయింగ్ 11 (అంచనా):
తాంజిద్ హసన్ తమీమ్, లిట్టన్ దాస్ (కెప్టెన్, వికెట్ కీపర్), సైఫ్ హసన్, తౌహిద్ హృదయ్, జాకర్ అలీ, షమీమ్ హొస్సేన్, నూరుల్ హసన్, నసుమ్ అహ్మద్, రిషాద్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహమాన్, తస్కిన్ అహ్మద్