శ్రీలంకదే వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌

శ్రీలంకదే వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌

హంబంటోట:  బౌలర్లు దుష్మంత చమీర (4/63),  వానిందు హసరంగ (3/7) చెలరేగడంతో అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌తో మూడు వన్డేల సిరీస్‌‌‌‌‌‌‌‌ను శ్రీలంక 2–1తో సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన మూడో, చివరి పోరులో లంక 9 వికెట్ల తేడాతో అఫ్గాన్‌‌‌‌‌‌‌‌ను చిత్తు చేసింది. టాస్‌‌‌‌‌‌‌‌ నెగ్గి మొదట బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన అఫ్గాన్‌‌‌‌‌‌‌‌ 22.2 ఓవర్లలో 116 రన్స్‌‌‌‌‌‌‌‌కే ఆలౌటైంది.

మొహమ్మద్‌‌‌‌‌‌‌‌ నబీ (23), ఇబ్రహీం జద్రాన్‌‌‌‌‌‌‌‌ (22) టాప్‌‌‌‌‌‌‌‌ స్కోరర్లు. అనంతరం లంక 16 ఓవర్లలోనే 120/1 స్కోరు చేసి గెలిచింది. దిముత్‌‌‌‌‌‌‌‌ కరుణరత్నె (56 నాటౌట్‌‌‌‌‌‌‌‌), పాథుమ్‌‌‌‌‌‌‌‌ నిశాంక (51) ఫిఫ్టీలతో రాణించారు. చమీరకు ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌, సిరీస్‌‌‌‌‌‌‌‌ అవార్డులు దక్కాయి.