ఓటీటీలోకి ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ బ‌యోపిక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

 ఓటీటీలోకి ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ బ‌యోపిక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

శ్రీలంక లెజెండ‌రీ క్రికెటర్ ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ (Muttiah Muralitharan) జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న మూవీ 800. ఎంఎస్ శ్రీపతి ద‌ర్శ‌క‌త్వంలో తెరెకెక్కిన ఈ సినిమాలో ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ పాత్ర‌లో స్లమ్‌డాగ్ మిలియనీర్ ఫేమ్ మధుర్ మిట్టల్(Madhurr Mittal) నటించి మెప్పించాడు.

ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ తన జీవితంలో ఎదుర్కొన్న సంఘ‌ట‌న‌లు, పరిస్థితులను, ఎత్తు ప‌ల్లాల‌ను ఎంతో భావోద్వేగ‌భ‌రితంగా చూపించిన ఈ చిత్రం అక్టోబర్ 6న థియేటర్లో రిలీజై ప్రశంసలు అందుకుంది. లేటెస్ట్గా ఈ సినిమా ఓటీటీలోకి రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా వచ్చే నెల డిసెంబర్ 2వ తేదీ నుంచి తెలుగు, హిందీ, తమిళ భాషల్లో జియో సినిమాలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. 

ఈ సినిమాలో శ్రీలంక టీమ్‌లో స్థానం కోసం ఆయన ప‌డిన క‌ష్టాలు, జ‌ట్టులోకి వచ్చాక నిలదొక్కుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నాలు, తనని తాను ఒక గొప్ప బౌల‌ర్‌గా ఆవిష్క‌రించుకున్న తీరును అద్భుతంగా చూపించారు. అంతేకాదు కెరీర్ మధ్యలో ఎదుర్కొన్న వివాదాలను అది ప్రూవ్ చేసుకోవడానికి ఆయన ఎదుర్కొన్న పరీక్షలను, వాటి వెనుక ఆయన పడిన బాధను కళ్ళకు కట్టినట్టుగా చూపించారు.