హై వోల్టేజ్‌‌ హ్యూమర్‌‌‌‌ తో... కామ్రేడ్ కళ్యాణ్

హై వోల్టేజ్‌‌ హ్యూమర్‌‌‌‌ తో... కామ్రేడ్ కళ్యాణ్

శ్రీవిష్ణు హీరోగా వచ్చిన ‘సామజవరగమన’ హిలేరియస్‌‌ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌గా మెప్పించిన విషయం తెలిసిందే. ఇప్పుడీ కాంబినేషన్‌‌ను రిపీట్ చేస్తూ శ్రీవిష్ణు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో మైత్రి మూవీ  మేకర్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. విజయదశమి సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి హీరో సాయి దుర్గ తేజ్  క్లాప్ కొట్టారు. 

స్క్రిప్ట్‌‌ను నారా రోహిత్‌‌తో కలిసి నిర్మాతలకు అందజేశారు. నరేష్, వెన్నెల కిషోర్, సుదర్శన్, దర్శకులు వివేక్ ఆత్రేయ, హసిత్ గోలి హాజరయ్యారు. మరింత వైల్డ్‌‌గా, ఫన్‌‌గా ఉండే  హై వోల్టేజ్‌‌ హ్యూమర్‌‌‌‌తో నాన్ స్టాప్‌‌ ఎంటర్‌‌‌‌టైన్మెంట్‌‌ ఇవ్వబోతున్నామని మేకర్స్‌‌ వెల్లడించారు. 

కామ్రేడ్‌‌ కల్యాణ్‌‌ 

శ్రీవిష్ణు హీరోగా జానకిరామ్ మారెళ్ల తెరకెక్కిస్తున్న చిత్రానికి ‘కామ్రేడ్‌‌ కల్యాణ్‌‌’ అనే టైటిల్‌‌ను రివీల్ చేస్తూ ప్రోమో విడుదల చేశారు. నైంటీస్‌‌ బ్యాక్‌‌డ్రాప్‌‌లో నక్సలైట్‌‌ నాయకుడిగా శ్రీవిష్ణు కనిపించాడు. తనపై ఉన్న రూ.5 లక్షల రివార్డ్‌‌ వాంటెడ్‌‌ పోస్టర్‌‌ను తనే అతికించడం ఆసక్తి రేపింది. ఈ యాక్షన్‌‌-కామెడీ ఎంటర్​టైనర్​ను వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్నారు.