- విద్యాశాఖ బాధ్యతలు శ్రీదేవసేనకు అప్పగింత
హైదరాబాద్, వెలుగు: విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా నవంబర్1 నుంచి చైల్డ్ కేర్ లీవ్‌లో ఉండనున్నారు. డిసెంబర్ 12 వరకూ ఆమెకు సెలవును మంజూరు చేస్తూ సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.
దీంతో కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేనకు విద్యాశాఖ సెక్రటరీగా ఎఫ్ఏసీ(ఫుల్ అడిషనల్ ఛార్జ్) బాధ్యతలు అప్పగించారు. సెలవులు పూర్తికాగానే..యోగితారాణా తిరిగి మళ్లీ ఆదే పోస్టులో కొననున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
