హామీలను అమలు చేయకుంటే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయం: శ్రీధర్ బాబు

హామీలను అమలు చేయకుంటే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయం: శ్రీధర్ బాబు

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు.  గత పదేళ్లుగా బీజేపీ, బీఆర్ఎస్ కలిసి నడిచాయని.. ఒకరికొకరు సహాయం చేసుకున్నారన్నారు. కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వకుండా బీజేపీ తెలంగాణకు మోసం చేసిందని మండిపడ్డారాయన. ఏప్రిల్ 24వ తేదీ బుధవారం సాయంత్రం హన్మకొండ జిల్లా మడికొండలో కాంగ్రెస్ జనజాతర సభ నిర్వహించింది. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..  దేశంలో ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి.. . ఉద్యోగాలు ఇవ్వకుండా మోదీ సర్కార్ యువతను మోసం చేసిందన్నారు.  మేనిఫెస్టోలో పొందుపర్చిన ప్రతి అంశాన్ని అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు.  ఇచ్చిన హామీలను అమలు చేస్తుంటే బీఆర్ఎస్ భయపడుతోందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే వచ్చేసారి ఎన్నికల్లో పోటీ చేయమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.