
- హైకోర్టులో శ్రీధర్‌రావు తరఫు లాయర్ వాదనలు
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావుకు బెయిల్ ఇవ్వొద్దని సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్‌రావు తరఫు న్యాయవాది సత్య సరి హైకోర్టును కోరారు. ఆయన బెదిరిస్తేనే శ్రీధర్‌రావు రూ.13 కోట్లతో బీఆర్ఎస్ ఎలక్షన్ బాండ్స్ కొనుగోలు చేశారని తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ప్రభాకర్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు బుధవారం పూర్తయ్యాయి. తీర్పును తర్వాత వెలువరిస్తామని న్యాయమూర్తి జస్టిస్ జె.శ్రీనివాసరావు ప్రకటించారు. అంతకుముందు సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్‌రావు తరఫు న్యాయవాది సత్య సరి వాదనలు వినిపిస్తూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రభాకర్‌రావు చట్ట వ్యతిరేకంగా ఫోన్ ట్యాపింగ్ చేయించారని చెప్పారు.