భయపడుతూ భూమ్ భూమ్ తాగిన శ్రీకాంత్.. ఏమవుతుందో ఏమో?

భయపడుతూ భూమ్ భూమ్ తాగిన శ్రీకాంత్.. ఏమవుతుందో ఏమో?

ప్రముఖ నటుడి శ్రీకాంత్ అయ్యంగార్(Srikanth Iyengar) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను సోషల్ మీడియాలో వేదికగా తన ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగాఒక సెటైరికల్ వీడియో చేశారు శ్రీకాంత్ అయ్యంగార్. 

ఇటీవల ఆయన షూటింగ్ నిమిత్తం విజయవాడకు వెళ్లారు. సాయంత్రం షూటింగ్ అయిపోయాక రూమ్ కి వచ్చి బీర్ తాగారు. క్రమంలోనే ఆయన ఆ బీర్ గురించి చెప్తూ ఒక వీడియో చేసి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. నేను విజయవాడలో ఉన్నాను. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. కానీ.. కాస్త డిప్రెషన్ లో ఉండటం వల్ల బీర్ తెచ్చుకున్న(భూమ్ భూమ్ బీర్ ను చూపిస్తూ). అది మామూలు బీర్ కాదు. మా ఇంట్లో వాళ్లకు చెప్పలేదు, మా ఫ్రెండ్స్ కూడా చెప్పలేదు. తాగుతున్న.. ఏమౌతుందో తెలియదు.. గుర్తుపెట్టుకోండి.. నన్ను మర్చిపోవద్దే.. అంటూ సెటైరికల్ వీడియో షేర్ చేశారు. ఆ వీడియో కాస్త క్షణాల్లో వైరల్ గా మారింది. దీంతో ఏపీలో మాత్రమే దొరికే ఈ భీర్స్ పైన కావాలనే ఆయన కౌంటర్ వేశాడని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు