రాజన్న సేవలో శృంగేరి జగద్గురు..శంకరమఠంలో కలశ ప్రతిష్ట, కుంభాభిషేక పూజలు

రాజన్న సేవలో శృంగేరి జగద్గురు..శంకరమఠంలో కలశ ప్రతిష్ట, కుంభాభిషేక పూజలు
  • జగద్గురు వెంట మంత్రి పొన్నం, విప్​ఆది శ్రీనివాస్​ 

వేములవాడ, వెలుగు : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని శృంగేరి జగద్గురు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి మంగళవారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ముందుగా ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. 

అనంతరం స్వామికి ప్రత్యేక పూజలు చేసి, కోడె మొక్కు చెల్లించారు. ములవాడ భీమేశ్వర స్వామి ఆలయం పక్కన శంకరమఠంలో భారతి మహాస్వామి ప్రత్యేక పూజలు చేసి, రెండు రోజులుగా నిర్వహిస్తున్న యాగానికి పూర్ణాహుతి అందించారు. 

అనంతరం కలశ ప్రతిష్ట చేసి కుంభాభిషేకంలో పాల్గొన్నారు. శంకరమఠం ఆవరణలో నిర్మిస్తున్న కొత్త భవనాన్ని పరిశీలించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్​ఆది శ్రీనివాస్​, ఎస్పీ మహేశ్​బిగితే, ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, అడిషనల్​ఎస్పీ చంద్రయ్య, ఆలయ ఈవో రమాదేవి పాల్గొన్నారు.