అక్టోబర్ 1న శ్రీనిధి టీపీజీఎల్‌‌‌‌ ఐదో సీజన్‌‌‌‌ ప్లేయర్ల వేలం

అక్టోబర్ 1న శ్రీనిధి టీపీజీఎల్‌‌‌‌ ఐదో సీజన్‌‌‌‌ ప్లేయర్ల వేలం

హైదరాబాద్, వెలుగు: శ్రీనిధి యూనివర్శిటీ తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ (టీపీజీఎల్‌‌‌‌) ఐదో ఎడిషన్‌కు  ప్లేయర్ల వేలం అక్టోబర్ 1న జరగనుంది. హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్‌‌‌‌లో జరిగిన స్పాన్సర్స్‌‌‌‌, టీమ్ ఓనర్లు,  కెప్టెన్ల ఓరియంటేషన్ కార్యక్రమంలో  లీగ్ కమిషనర్ సంజయ్ ఈ సీజన్ క్యాలెండర్‌‌‌‌ను ప్రకటించారు.

అక్టోబర్ 25న 16 జట్లతో లీగ్ మ్యాచ్‌‌‌‌లు షురూ అవుతాయని తెలిపారు. నవంబర్ 23న ముగిసే ఈ టోర్నీలో ఈ సారి ప్రతీ జట్టులో12 మంది గోల్ఫర్లు బరిలోకి దిగుతారు. మొత్తం ఐదు లీగ్ రౌండ్లు, రెండు నాకౌట్స్‌‌‌‌, ఫైనల్‌‌‌‌ నిర్వహించనున్నారు.