పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రభుత్వం నిర్లక్ష్యం : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రభుత్వం నిర్లక్ష్యం :  మాజీ  మంత్రి శ్రీనివాస్ గౌడ్
  •     మాజీ  మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్ అర్బన్, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. శుక్రవారం ఆయన నివాసంలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టు పనుల్లో 90 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులకు టెండర్లు కూడా పూర్తయ్యాయని తెలిపారు. 

అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు ముందుకు సాగడం లేదన్నారు. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు ఉన్నప్పటికీ ఇప్పటివరకు మోటార్లు కూడా ఆన్ చేయలేదని విమర్శించారు. ప్రాజెక్టు పూర్తి కోసం త్వరలో నార్లపూర్ నుంచి ఉద్దండాపూర్ వరకు పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్, మాజీ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వెంకటేశ్వర రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, హర్షవర్ధన్, అంజయ్య యాదవ్, పట్నం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు