కోదాడ,వెలుగు: సీఐడీలో పని చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి సూర్యాపేట జిల్లా కోదాడ డీఎస్పీగా నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుతం కోదాడ లో పని చేస్తున్న శ్రీధర్ రెడ్డిని హైదరాబాద్ లోని సివిల్ సప్లయ్స్ కార్యాలయంలో ఆ శాఖ కమిషనర్ కు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. శ్రీనివాస్ రెడ్డి గతంలో సూర్యాపేట సీఐ గా పని చేశారు. మంగళవారం ఆయన హైదరాబాద్ లో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
