మోడల్ స్కూల్స్ అడిషనల్ డైరెక్టర్​గా శ్రీనివాసచారి

మోడల్ స్కూల్స్ అడిషనల్ డైరెక్టర్​గా శ్రీనివాసచారి

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ మోడల్ స్కూల్స్ అడిషనల్ డైరెక్టర్​గా శ్రీనివాసచారిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఆయనకు ఎఫ్​ఏసీ బాధ్యతలు అప్పగిస్తూ విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు.

జవహార్ బాలభవన్​ స్పెషల్ ఆఫీసర్​గా విజయ లక్ష్మీబాయికి ఎఫ్ఏసీ బాధ్యతలు ఇచ్చారు. ఇప్పటి వరకు ఈ రెండింటి బాధ్యతలను టీఆర్​ఈఐఎస్ సెక్రటరీ సీహెచ్​ రమణకుమార్ ఇన్ చార్జ్ గా ఉండి పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆయనను ఈ రెండు బాధ్యతల నుంచి తప్పించారు.