- 12 మందిపై కేసు నమోదు
బషీర్ బాగ్, వెలుగు: ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల భూమి కొనుగోలు వ్యవహారంలో భారీ మోసానికి గురయ్యారు. వికారాబాద్ జిల్లా కాద్మూర్ లోని రూ.7 కోట్ల విలువైన 4 ఎకరాల 36 గుంటల వ్యవసాయ భూమిని తమదేనని 12 మంది నిందితులు నమ్మబలకడంతో ఆయన దాదాపు రూ.కోటి చెల్లించారు.
ఇటీవల కోర్టు విచారణలో ఆ భూమి ఇతరుల పేరు మీద ఉందని తేలింది. నిందితులు ప్ర భాకర్ రెడ్డి, ఆనందం, ఆగిరెడ్డి, వెంకటరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, జగన్ రెడ్డి, పల్లె మైసమ్మ, మహే శ్వర్ రెడ్డి, సుశీల, రామచంద్రయ్య, సుధాకర్ రెడ్డి, కృష్ణపై శ్రీను వైట్ల సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.
